News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 24, 2024
VIRAL: రెస్టారెంట్లో విజయ్&రష్మిక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు డేటింగ్లో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తాను సింగిల్ కాదని, ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నానని హింట్ ఇచ్చారు. తాజా ఫొటోతో ఆ ప్రచారం కాస్తా మరింత పెరిగింది.
News November 24, 2024
రికార్డు సృష్టించిన హార్దిక్ పాండ్య
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఘనత సాధించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ఈ బరోడా ప్లేయర్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74* పరుగులు చేశారు. హార్దిక్ దూకుడుతో బరోడా 185 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది.
News November 24, 2024
సీజనల్ ఫీవర్స్‌పై ప్రభుత్వం ఫోకస్
AP: రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజనింగ్‌పై ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పీహెచ్‌సీలకు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్స్‌ను తరలించింది. కలుషిత నీటిపై అధికారులు ఫోకస్ పెట్టాలని, ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించింది.