News September 4, 2024

పాక్‌పై విజయం.. బంగ్లా కెప్టెన్ ఫొటో వైరల్

image

పాకిస్థాన్‌పై గుర్తుండిపోయే టెస్టు సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఆ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో ఈ విజయం బంగ్లాదేశ్‌కు ఎంత విలువైందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News November 15, 2025

పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

image

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్‌<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.

News November 15, 2025

ప్రభాస్- డాన్స్ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ కాంబోలో మూవీ?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్& కల్కి సీక్వెల్స్ ఉండగా మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్‌గా మారనున్నారని, ఆయన చెప్పిన కథను ప్రభాస్ ఓకే చేసినట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే Jan-9న విడుదలవనుంది.

News November 15, 2025

ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌‌. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.