News September 4, 2024

పాక్‌పై విజయం.. బంగ్లా కెప్టెన్ ఫొటో వైరల్

image

పాకిస్థాన్‌పై గుర్తుండిపోయే టెస్టు సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఆ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో ఈ విజయం బంగ్లాదేశ్‌కు ఎంత విలువైందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News September 10, 2024

పంత్ టెస్ట్ క్రికెట్ దిగ్గజం అవుతాడు: గంగూలీ

image

టీమ్ ఇండియాలో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. బంగ్లాతో టెస్టులకు పంత్ ఎంపికైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘రిషభ్ తిరిగి జట్టులోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మున్ముందు భారత్‌ టెస్టు ఆటగాళ్లలో తను ఓ దిగ్గజమవుతాడు. పొట్టి ఫార్మాట్లలో మాత్రం పంత్ మరింత మెరుగవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

News September 10, 2024

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ హోదానా? సిగ్గు.. సిగ్గు: KTR

image

TG: ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన <<14061145>>పీఏసీ ఛైర్మన్ <<>>పదవిని, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? అని కేటీఆర్ నిలదీశారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా?’ అని Xలో కేటీఆర్ ప్రశ్నించారు.

News September 9, 2024

రేపు వర్షాలు ఉన్నాయా?

image

రేపు ఉ.8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, నిర్మల్, NZB, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD సహా మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలో శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, తూ.గో. జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.