News July 18, 2024
చైల్డ్ పోర్న్ చూడటం నేరం కాదు: కర్ణాటక HC
కేవలం చైల్డ్ పోర్న్ చూడటం నేరంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తన క్లయింట్ చైల్డ్ పోర్న్ చూశారని, కానీ దాన్ని సర్క్యులేట్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. IT చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం అతడు పోర్న్‌ను ప్రచురించడం/ప్రసారం చేయలేదని పేర్కొన్న కోర్టు అతడికి ఉపశమనం కలిగించింది. కాగా 50 నిమిషాల పాటు చైల్డ్ పోర్న్ చూశాడనే కారణంతో 2022 మార్చిలో ఈ కేసు నమోదైంది.
Similar News
News December 11, 2024
మోహన్ బాబు ఇంట్లోనే మనోజ్.. ఏం జరగనుంది?
TG: శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు ఉన్నారు. మనోజ్ అక్కడే ఉంటారా? వెళ్లిపోతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అస్వస్థతకు గురి కావడంతో మోహన్ బాబును మంచు విష్ణు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో విష్ణు తిరిగి జల్‌పల్లికి వస్తే మళ్లీ గొడవ ఏమైనా జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది. అటు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
News December 10, 2024
టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్: ఛైర్మన్
AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.
News December 10, 2024
కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు!
Jan 13 నుంచి Feb 26 వరకు జరగనున్న మహా కుంభమేళా- 2025కు ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని UP ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల సంఖ్యను కచ్చితత్వంతో నిర్ధారించేందుకు AI కెమెరాలను ఉపయోగించనున్నారు. జనసమూహం నిర్వహణలో కొత్త మైలురాయిని సృష్టించడం సహా ఇలాంటి స్మారక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.