News September 7, 2024

కేరళలో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్!

image

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈనెల మధ్య నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు నెలన్నర రోజులకు పైగా ఫైట్స్‌తో పాటు సాంగ్స్ షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దసరా పండుగకు టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని టాక్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News January 30, 2026

భార్య కారణంగా భర్త, సంబంధం చూసిన వ్యక్తి ఆత్మహత్య

image

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి.. భర్త, సంబంధం చూసిన మామ(వరుసకు) ఆత్మహత్యకు కారణమైంది. KAలోని గుమ్మనూరుకు చెందిన హరీశ్, సరస్వతికి 2నెలల క్రితం వివాహమైంది. ఆమె ప్రియుడు శివతో ఇటీవల వెళ్లిపోయింది. అవమానంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నాడు. అది తెలిసి సంబంధం చూసిన రుద్రేశ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరస్వతి లవ్ గురించి ముందే తెలిసిన హరీశ్ ఆమె పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవడం కొసమెరుపు.

News January 30, 2026

‘ధురంధర్’ OTT.. నెట్‌ఫ్లిక్స్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

image

నెట్‌ఫ్లిక్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ధురంధర్’ మూవీ ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో దాదాపు 10 నిమిషాల సీన్లు తొలగించడంతో పాటు చాలా డైలాగ్స్ మ్యూట్ చేయడంపై మండిపడుతున్నారు. ‘A’ సర్టిఫికెట్ ఉన్న సినిమాను OTTలో కట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యానిమల్‌, కబీర్‌ సింగ్‌కు లేని కండీషన్లు దీనికే ఎందుకని Netflixను నిలదీస్తున్నారు.

News January 30, 2026

ఉగాదికి జాబ్ క్యాలెండర్!

image

AP: ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ఖాళీలను సేకరిస్తున్నట్లు సమాచారం. పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖపై పడే భారం బేరీజు వేసుకొని ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపాయి.