News November 21, 2024

డేటింగ్‌‌పై స్పందించిన విజయ్ దేవరకొండ

image

తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ‘నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా’ అని రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్‌తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News December 11, 2024

మన ఆటగాళ్లు వెనక్కి తగ్గాల్సిన పనే లేదు: రవిశాస్త్రి

image

సిరాజ్, హెడ్ మధ్య జరిగిన గొడవపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘సిక్స్ కొట్టించుకున్న ఫాస్ట్ బౌలర్ వికెట్ తీశాక సిరాజ్‌లా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అవతలి వాళ్లు ఒకటి అంటే మనం రెండు అనాలి. వెనక్కి తగ్గాల్సిన పనేలేదు. భారత కోచ్‌గా ఉన్నప్పుడూ ఆటగాళ్లకు అదే చెప్పాను. పరిస్థితిని మరింత దిగజారనివ్వని పరిపక్వత హెడ్, సిరాజ్‌కు ఉంది కాబట్టి సమస్య లేదు’ అని పేర్కొన్నారు.

News December 11, 2024

‘పుష్ప-2’ అద్భుతం: వెంకటేశ్

image

‘పుష్ప-2’ సినిమాపై విక్టరీ వెంకటేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్ అద్భుతమైన ప్రదర్శన స్క్రీన్‌పై నుంచి నా దృష్టిని మరల్చనివ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది. రష్మిక నటన, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం. పుష్ప-2 సూపర్ సక్సెస్ అయినందున డైరెక్టర్ సుకుమార్‌కి, చిత్రయూనిట్‌కు అభినందనలు’ అని వెంకీ ట్వీట్ చేశారు.

News December 11, 2024

మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్

image

TG: మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అటు ప్రతి రెండు గంటలకోసారి ఆయన ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.