News February 14, 2025

విజయ్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రత

image

కోలీవుడ్ హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కు కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీ కింద ఆయనకు షిఫ్టులవారీగా 11 మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. నలుగురు కమాండోలు, ఏడుగురు పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. కాగా ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయనకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News March 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

రాజన్న SRCL జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. చందుర్తి(M) ఎనగల్ గ్రామంలో పసుల లచ్చయ్య(60) అనే ఉపాధిహామీ <<15847894>>కూలీ<<>> పనిచేసాక భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మామిండ్ల మహేశ్(24) ఈ నెల17న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందాడు. బోయినపల్లి మండలం మానవాడలో దాసరి నర్సయ్య(58) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

News March 23, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

బర్డ్‌ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.

News March 23, 2025

నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

image

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.

error: Content is protected !!