News June 14, 2024
విజయ్ సేతుపతి ‘మహారాజ’ REVIEW
విజయ్ సేతుపతి నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజ’. హీరో బిడ్డను కాపాడిన లక్ష్మి కిడ్నాప్ కావడం, ఇంతకీ ఆమె ఎవరనేది డైరెక్టర్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఊహించని ట్విస్టులతో సాగుతుంది. విజయ్ నటన, BGM, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. స్టోరీ నెమ్మదిగా సాగడం కాస్త మైనస్.
RATING: 3/5
Similar News
News September 16, 2024
మోదీ 3.0: ఈసారే జమిలి ఎన్నికలు!
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.
News September 16, 2024
బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
BREAKING: రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.