News May 18, 2024
విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ VFX పూర్తి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా గురించి డైరెక్టర్ వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్స్ పూర్తయ్యాయని, ఔట్‌పుట్ చూసేందుకు వేచి ఉండలేకపోతున్ననట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.
Similar News
News December 14, 2024
బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది : RGV
హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.
News December 14, 2024
GREAT: సైకిల్‌పైనే 41,400Kms వెళ్లిన రంజిత్
సైకిల్‌పై పక్కూరికి వెళ్లేందుకే కష్టమనుకునే వారున్న రోజుల్లో వరంగల్(TG)కి చెందిన రంజిత్ నాలుగేళ్లలో 41,400 KMS ప్రయాణించారు. తన తండ్రి 2020లో మరణించగా, ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆయన కలను తాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. స్తోమత లేకపోవడంతో సైకిల్‌పైనే ఇప్పటివరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన AUSలో ఉండగా BGT మ్యాచుకు వెళ్లారు.
News December 14, 2024
గబ్బా టెస్టులో సారా టెండూల్కర్ సందడి
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సందడి చేశారు. స్టాండ్స్‌లో నుంచి భారత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా సారా సందడి చేసిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.