News December 12, 2024
విజయ్ వాయిస్ ఓవర్ ప్రత్యేకం: రష్మిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733735329244_1226-normal-WIFI.webp)
తాను నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చివరి వరకు తనకు తెలియదని హీరోయిన్ రష్మిక తెలిపారు. కానీ తనకు అది ప్రత్యేకమని ఆమె చెప్పారు. ‘నాకు హీరోలందరితోనూ స్నేహం ఉంది. సల్మాన్ సెట్‌లో ఉంటే షూటింగ్ సరదాగా సాగుతుంది. ఓసారి నేను సెట్‌లో అనారోగ్యానికి గురైతే మంచి ఫుడ్ తెప్పించారు. ఆయన నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దళపతి విజయ్ అంటే కూడా ఎంతో ఇష్టం’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 21, 2025
GTA6: ఆడాలంటే రూ.9 వేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737385881497_1-normal-WIFI.webp)
90s కిడ్స్ ఫేవరెట్ కంప్యూటర్ వీడియో గేమ్స్‌లో ఒకటైన GTA 6 వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది. కొత్త ఎడిషన్ గేమ్‌కు రాక్‌స్టార్ $100 (దాదాపు రూ.9000) ఛార్జ్ చేయొచ్చని గేమ్ అనలిస్ట్ మ్యాథ్యూ బాల్ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, పెరిగిన R&D, క్రియేటివ్ కంటెంట్ ఖర్చుల వల్ల ఆ సంస్థ ఈ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకీ మీలో ఎంతమంది Grand Theft Auto (GTA) ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేయండి.
News January 21, 2025
HEADLINES
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737395086429_367-normal-WIFI.webp)
*అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
*కోల్‌కతా హత్యాచార దోషికి జీవిత ఖైదు
*లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్లు.. హైకమాండ్ ఆగ్రహం
*పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్
*ఏపీలో 26 మంది IASలు, 27 మంది IPSలు బదిలీ
*స్విట్జర్లాండ్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
*తెలంగాణలో మళ్లీ రానున్న కింగ్ ఫిషర్ బీర్లు
*రేవంత్‌కు చుక్కలు చూపెట్టాలి: KTR
News January 21, 2025
ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737395651841_782-normal-WIFI.webp)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.