News December 31, 2024
సీఎస్‌గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ

AP: రాష్ట్ర సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో, హోం సెక్రటరీ, పలువురు ఐఏఎస్‌లు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు సీఎస్‌గా పనిచేసిన నీరభ్ కుమార్ పదవీ విరమణ చేశారు.
Similar News
News December 1, 2025
ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
News December 1, 2025
ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.
News December 1, 2025
ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


