News January 31, 2025

YCPకి విజయసాయి రాజీనామా

image

AP: మొన్న ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇవాళ YCP, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామాను జగన్‌కు పంపినట్లు ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచి CM కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ VSR కృతజ్ఞతలు చెప్పారు. శత్రువులకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయం ప్రారంభించినట్లు తెలిపారు.

Similar News

News September 13, 2025

KTRకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా: మహేశ్

image

TG: ఫిరాయింపు MLAల విషయంలో రాహుల్‌గాంధీని KTR <<17689238>>ప్రశ్నించడంపై<<>> TPCC చీఫ్ మహేశ్‌ గౌడ్ ఫైరయ్యారు. ‘MLAలపై రాహుల్‌ ఎందుకు మాట్లాడాలి? KTR స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. BJPలో BRS విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.

News September 13, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.

News September 13, 2025

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు

image

TG: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని BRS నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘జాబ్స్‌ కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు చెబుతున్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలనుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంకతో చెప్పించి రేవంత్ మోసం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.