News January 31, 2025
YCPకి విజయసాయి రాజీనామా

AP: మొన్న ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇవాళ YCP, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామాను జగన్‌కు పంపినట్లు ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచి CM కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ VSR కృతజ్ఞతలు చెప్పారు. శత్రువులకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయం ప్రారంభించినట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
జులై 6: చరిత్రలో ఈరోజు

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.