News April 6, 2025
ఆ పాత్ర కోసం 10 కేజీల బరువు తగ్గా: విజయశాంతి

‘అర్జున్ S/O వైజయంతి’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం 10KGల బరువు తగ్గినట్లు విజయశాంతి చెప్పారు. నాన్‌వెజ్ మానేసి స్పెషల్ డైట్, వర్కవుట్లు చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పోలీస్ పాత్ర అనగానే కర్తవ్యం, వైజయంతి సినిమాలు గుర్తుకొస్తాయి. అప్పటి లుక్‌తో పోల్చుతారు. అందుకే కష్టమైనా సరే బరువు తగ్గా’ అని వివరించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
Similar News
News April 7, 2025
45 ఏళ్ల వయసులో గెలుపు.. చరిత్ర సృష్టించిన బోపన్న

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. ‘ATP మాస్టర్స్ 1000’ ఈవెంట్‌లో డబుల్స్ మ్యాచ్ గెలిచిన ఓల్డెస్ట్ ప్లేయర్(45 ఏళ్ల ఒక నెల)గా నిలిచారు. బోపన్న-షెల్టన్ జోడీ ఫ్రాన్సిస్కో- టబీలోపై 6-3, 7-5 తేడాతో విజయం సాధించింది. కాగా 2017లో కెనడాకు చెందిన డేనియల్ 44 ఏళ్ల 8 నెలల వయసులో ఫాబ్రిక్ మార్టిన్‌తో కలిసి మ్యాచ్ గెలిచారు. అది కూడా బోపన్న-పాబ్లో జోడీపై కావడం విశేషం.
News April 7, 2025
కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.
News April 7, 2025
ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్‌ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.