News March 6, 2025
MLC సీటు కోసం విజయశాంతి మంతనాలు

TG: కాంగ్రెస్ ముఖ్యనేత విజయశాంతి హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలుపెట్టారు. AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఆమె తనకు సీటు కేటాయించాలని కోరారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 29, 2026
బుద్ధి లేనివాడు ఎలాంటి మాటలు చెబుతాడు?

అల్పుడెపుడుబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ విలువ ఉండే కంచుకు వచ్చినంత శబ్ధం విలువైన బంగారానికి రాదు. అలాగే తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెబుతూ ఉంటాడు. మంచి ప్రవర్తన గల వ్యక్తి శాంతంగా, సున్నితంగా మాట్లాడతాడు.
<<-se>>#PADHYAM<<>>
News March 29, 2026
‘ఫైర్‌తో ఆడేశాం’.. SRHపై RCB ట్రోల్స్

నిన్నటి SRH vs RCB మ్యాచ్‌తో మళ్లీ IPLలో ఫ్రాంచైజీల మధ్య ట్రోల్స్ సందడి మొదలైంది. ‘ప్లే విత్ ఫైర్’ అని మ్యాచ్‌కు ముందు ఎలివేషన్ ఇచ్చిన SRHను ఓడించడంతో RCB ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని కౌంటర్ ఇచ్చింది. కోహ్లీ ఛేజింగ్‌ను ఆరెంజ్ జెర్సీలో చూస్తే ఇంకా మజా ఉంటుందని మరో పోస్ట్ పెట్టింది. ఇక కోహ్లీ కొట్టిన ఓ సిక్స్‌కు ‘ఏం షాట్ రా మామా’ అని క్యాప్షన్ పెట్టింది.
News March 29, 2026
భూభారతి ద్వారా ₹12,443కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు: ప్రభుత్వం

TG: భూభారతి పోర్టల్‌లో లావాదేవీల ద్వారా ₹1,518.64కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోర్టల్‌లో 6.17లక్షల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ జరిగాయని.. జనవరి నాటికి ₹12,443.64కోట్ల విలువైన రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం ₹16,021కోట్లకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. కాగా ధరణిని భర్తీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం లాంచ్ భూభారతి చేసింది.


