News March 6, 2025

MLC సీటు కోసం విజయశాంతి మంతనాలు

image

TG: కాంగ్రెస్ ముఖ్యనేత విజయశాంతి హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలుపెట్టారు. AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఆమె తనకు సీటు కేటాయించాలని కోరారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 24, 2025

ఈ ఏడాదిలో ఇదే చివరి వారం

image

అదేంటీ ఇది మార్చి నెలే కదా అనుకుంటున్నారా. మన తెలుగు సంవత్సరం అయిన ‘క్రోధినామ’ సంవత్సరం ఈనెల 29న పూర్తి కానుంది. అంటే ఈ ఏడాదిలో ఇదే చివరి వారం. వచ్చే ఆదివారం 30న ఉగాది సందర్భంగా తెలుగువారంతా ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెడతారు. పూర్తిగా ఇంగ్లిష్ క్యాలెండర్‌కు అలవాటుపడ్డ మనం తెలుగు సంవత్సరాలు, పంచాంగం, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు?

News March 24, 2025

అమెరికా టూరిజంపై ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్

image

వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల అమెరికా టూరిజంపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓ నివేదికలో వెల్లడించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కఠినమైన వలస విధానాలు, సుంకాలు పెంచుతూ వెళ్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరికల్లా 5.1% మంది విదేశీ పర్యాటకులు తగ్గిపోయి, రూ.5.5లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ఫిబ్రవరిలోనే కెనడా నుంచి టూరిస్టుల రాక 23% తగ్గిందని వివరించింది.

News March 24, 2025

ఇకపై వారి అకౌంట్లలోనే పింఛన్ జమ

image

AP: సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 10వేల మంది దివ్యాంగ స్టూడెంట్స్‌కి ఉపశమనం కలగనుంది.

error: Content is protected !!