News August 15, 2024
విజయవాడ-ఢిల్లీ కొత్త ఫ్లైట్ ఎప్పటినుంచంటే?
విజయవాడ, ఢిల్లీ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ఫ్లైట్ ప్రతి రోజు ఉ.11:10కి విజయవాడ నుంచి బయల్దేరి మ.1:40కి ఢిల్లీ చేరుకుంటుందని, అక్కడి నుంచి తిరిగి ఉ.8:10కి బయల్దేరి ఉ.10:40కి విజయవాడకు చేరుతుందని తెలిపారు. ఇది అమరావతి, ఢిల్లీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
Similar News
News September 12, 2024
మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!
మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.
News September 12, 2024
హరియాణా అసెంబ్లీ రద్దు
హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.
News September 12, 2024
ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.