News September 30, 2024
‘టాక్సీవాలా’ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. షూట్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ, ‘టాక్సీవాలా’ సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. 1854-1878 కాలంలో ఈ మూవీ కథ జరుగుతుందని, అక్టోబర్‌లో లేదా నవంబర్ తొలి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Similar News
News October 11, 2024
స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆటలా?: గుడివాడ అమర్నాథ్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు కన్‌ఫ్యూజ్ చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘NDAలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణ ఆపలేరా? దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్‌లు ఉన్నా, దీనినే ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? సెయిల్‌లో ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News October 11, 2024
రేపే ‘విశ్వంభర’ టీజర్ విడుదల!
మెగాఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్‌ను రేపు ఉదయం 10.49కి విడుదల చేయనున్నట్లు ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్ చేశారు. సినీప్రియులు వేడుక చేసుకునేలా మూవీ ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.
News October 11, 2024
నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలపాటు ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు పుణే, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి.