News October 8, 2024
ఈనెల 14 నుంచి ‘పల్లె పండుగ’: Dy.CM పవన్

AP: ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు Dy.CM పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ₹4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000kms మేర సీసీ రోడ్లు, 500 kms మేర తారు రోడ్లు వేయాలన్నారు.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


