News October 8, 2024
ఈనెల 14 నుంచి ‘పల్లె పండుగ’: Dy.CM పవన్
AP: ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు Dy.CM పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ₹4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000kms మేర సీసీ రోడ్లు, 500 kms మేర తారు రోడ్లు వేయాలన్నారు.
Similar News
News November 3, 2024
IPL.. RCB కెప్టెన్ కోహ్లీ కాదా?
RCB కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ జట్టు డైరెక్టర్ మొ బొబట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. మా పాత కెప్టెన్ డుప్లిసెస్‌ను మేం రిటైన్ చేసుకోలేదు. అతడు గతేడాది అద్భుతంగా జట్టును ముందుకు నడిపారు. వేలంలో ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తాం’ అని అన్నారు. దీంతో RCB కెప్టెన్ ఎవరనే దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
News November 3, 2024
నాన్న హంతకురాలిని ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు: రాహుల్
రాజీవ్ గాంధీ హంతకురాలు నళినిని ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన కరుణ గల వ్యక్తి ప్రియాంకా గాంధీ అని రాహుల్ గాంధీ అన్నారు. జీవితంలో ఆమె ఈ రకమైన పెంపకాన్ని పొందారని, ప్రస్తుతం దేశంలో ఈ తరహా ప్రేమ-ఆప్యాయతలతో కూడిన రాజకీయాల అవసరం ఉందని, ద్వేషపూరిత రాజకీయాలు కాదన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గెలిస్తే ఉత్తమ MPగా నిలుస్తారని రాహుల్ పేర్కొన్నారు.
News November 3, 2024
అంబులెన్స్ దుర్వినియోగం.. కేంద్ర మంత్రిపై కేసు
లోక్‌సభ ఎన్నికల వేళ అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేరళ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. గతంలో త్రిసూర్ BJP MP అభ్యర్థిగా బరిలో ఉన్న సురేశ్ స్థానికంగా పూరం ఉత్సవానికి సొంత వాహనంలో కాకుండా అంబులెన్స్‌లో వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధికార, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అంబులెన్స్ ఉపయోగించలేదని ఒకసారి, ఉపయోగించినట్లు మరోసారి గోపీ అంగీకరించారు.