News December 13, 2024

బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు

image

TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

Similar News

News February 19, 2026

రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

image

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

News February 19, 2026

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

News February 19, 2026

‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

image

‘వారణాసి’ తనకు కెరీర్ డిఫైనింగ్ సినిమా అవుతుందని హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ‘రాజమౌళికి ఉన్న విజన్ ఎవరికీ లేదు. ఆయనతో వర్క్ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. నా కెరీర్‌పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది చాలా భిన్నం’ అని ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2027 APR7న రిలీజ్ కానుంది.