News September 6, 2024
వినాయక చవితి: మట్టి గణపతినే పూజిద్దాం
హిందూధర్మంలో ప్రతి పండుగకు ఓ అర్థం ఉంటుంది. ప్రతి వేడుకా పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గణేశ చతుర్ధికి వాడే పూజాపత్రాలన్నీ ప్రకృతిసిద్ధమైనవే. మరి పార్వతీపుత్రుడి విగ్రహాల్ని మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి ఎందుకు వాడాలి? నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయేలా, ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనాథుల్నే పూజకు వినియోగిద్దాం. ఆ గణపయ్య కృపకు పాత్రులవుదాం.
Similar News
News September 13, 2024
సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్.. 7 బంతుల్లో డకౌట్
అసలే సెలక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు. దీనికి తోడు ఫామ్‌లేమి. పైగా సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చారు. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడారా అంటే అదీ లేదు. జస్ట్ 7 బంతులాడి డకౌటయ్యారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-డి తరఫున శ్రేయస్ అయ్యర్ తాజా ప్రదర్శన తీరిది. ఇంకేముందీ నెటిజన్లు రంగంలోకి దిగి ట్రోలింగ్ మొదలెట్టారు. సైట్ ఇష్యూస్ ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు.
News September 13, 2024
ఈ వివాదానికి రేవంతే కారణం: హరీశ్ రావు
TG: కౌశిక్ రెడ్డి-గాంధీ వివాదానికి ముఖ్య కారకుడు CM రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘CM బజారు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనలాగే గాంధీ, దానం వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదం రేవంత్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది’ అని మండిపడ్డారు.
News September 13, 2024
ఇదీ మంత్రుల పరిస్థితి: YCP
AP: మంత్రుల ఎదుట రెవెన్యూ, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూర్చున్న తీరుని విమర్శిస్తూ YCP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అందులో మంత్రులు అనిత, అనగాని, నారాయణ, నిమ్మల ముందు సిసోదియా కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. CBN ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ YCP ఎద్దేవా చేసింది. కాగా VJA వరదల విషయం ముందే తెలుసని, లక్షల మందిని తరలించడం సాధ్యం కాదని సిసోదియా అన్న వ్యాఖ్యలు ఇటీవల వైరలయ్యాయి.