News September 6, 2024
కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న వినేశ్, బజరంగ్
రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ఈ మ.1.30 గంటల తర్వాత వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. రెండ్రోజుల క్రితమే వారు రాహుల్ గాంధీని కలవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీచేయడం ఖాయమే. పారిస్ నుంచి తిరిగొచ్చాక వినేశ్ బిజీగా గడుపుతున్నారు. ఖాప్ పంచాయతీ పెద్దలు, కాంగ్రెస్, రైతు సంఘాల నేతలను కలిశారు.
Similar News
News September 14, 2024
విషాదం: టీ పౌడర్ అనుకొని..
AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
News September 14, 2024
కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్
హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
News September 14, 2024
‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే
నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.