News August 6, 2024
సెమీస్‌కు వినేశ్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆమె సెమీఫైనల్ చేరారు. ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానాను వినేశ్ 7-5 తేడాతో ఓడించారు. ఇవాళ రాత్రి జరిగే సెమీస్‌లో వినేశ్ తలపడనున్నారు. అందులో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం కానుంది.
Similar News
News September 19, 2024
లడ్డూ విషయంలో దేవుడు క్షమించడు: బండి
లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో AP ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
News September 19, 2024
జానీ మాస్టర్ దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు: భార్య సుమలత
TG: తన భర్త జానీ మాస్టర్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఆయన భార్య సుమలత అన్నారు. ఆయనపై కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ‘లవ్ జిహాదీ అని ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఆరోపణలు రుజువైతే జానీని వదిలేసి వెళ్తా. ఆ అమ్మాయికి చాలామందితో అఫైర్ ఉంది. అవార్డ్ వచ్చినప్పటి నుంచి కావాలనే జానీని టార్గెట్ చేశారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి నా భర్త.’ అని ఆమె పేర్కొన్నారు.
News September 19, 2024
భారత చెస్ జట్లు అదుర్స్!
చెస్ ఒలింపియాడ్ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.