News August 6, 2024
ఫైనల్‌కు వినేశ్ ఫొగట్.. పతకం ఖాయం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో క్యూబా రెజ్లర్‌తో జరిగిన పోరులో ఆమె 5-0 తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో భారత్‌కు పతకం ఖాయమైంది. రేపు జరిగే ఫైనల్లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ దక్కుతుంది. మరోవైపు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర లిఖించారు.
Similar News
News September 16, 2024
మోదీ 3.0: ఈసారే జమిలి ఎన్నికలు!
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.
News September 16, 2024
బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
BREAKING: రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.