News August 16, 2024
రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన వినేశ్ ఫొగట్!
రిటైర్మెంట్‌పై భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వెనక్కి తగ్గారు. విభిన్న పరిస్థితుల నడుమ తాను 2032 వరకు ఆడాలనుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తన భవిష్యత్తు ఏంటో తనకు తెలియదన్నారు. సరైందని భావించే దాని కోసం కచ్చితంగా పోరాడుతానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో వ్యక్తిగత, శిక్షణ సిబ్బంది అండగా నిలిచారన్నారు. ఒలింపిక్స్‌లో భారత జెండాను రెపరెపలాడించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు.
Similar News
News September 19, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.
News September 19, 2024
ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో భారత క్రికెట్ గేమ్ ఛేంజర్ ఉన్నారు. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు, 100కుపైగా వికెట్లు, 100కుపైగా క్యాచ్‌లు పట్టారు. ఆయన నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారింది. 100కు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో PWI, KKRకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.
News September 19, 2024
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.