News August 14, 2024
తీర్పు వచ్చేవరకు భారత్ రాకూడదని వినేశ్ నిర్ణయం?
ఒలింపిక్ మెడల్ విషయంలో రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆర్బిట్రేషన్ కోర్టు(CAS)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13నే తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ న్యాయస్థానం 16కు వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చేవరకు ఫొగట్ భారత్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒలింపిక్స్ కేసుల్ని పరిష్కరించేందుకు గాను పారిస్‌లోనే CAS ఓ అడ్ హక్ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. అందులోనే వినేశ్ కేసు ఉంది.
Similar News
News September 18, 2024
ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.
News September 18, 2024
BREAKING: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు
TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.
News September 18, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.