News March 30, 2024

ఉల్లంఘనలపై ‘విజిల్’తో హెచ్చరిస్తున్నారు

image

సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్‌లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.

Similar News

News September 17, 2025

విశ్వకర్మ ఎవరు?

image

విశ్వకర్మ ఓ దేవశిల్పి. విశ్వానికి ఆయన వాస్తుశిల్పి. ఆయనను సృష్టికర్త బ్రహ్మ కుమారుడిగా చెబుతారు. విశ్వంలోని భౌతిక రూపాలన్నింటిని, దేవతల ఆయుధాలని, దివ్యమైన భవనాలను ఆయనే సృష్టించాడని పురాణాలు చెబుతాయి. ఆయన సృష్టి సృజనాత్మక శక్తికి ప్రతీక. వేదాల ప్రకారం.. విశ్వకర్మే విశ్వసృష్టికి మూలకారకుడు. ఆధ్యాత్మికంగా ఆయన దేవతలందరికీ పూజనీయుడు. నేడు ఆయన జయంతి. ద్వారకా నగరాన్ని కూడా విశ్వకర్మ సృష్టించాడని అంటారు.

News September 17, 2025

కన్యా సంక్రమణం అంటే?

image

సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని ‘సంక్రమణం’ అని అంటారు. అలా.. భానుడు భాద్రపద మాసంలో కన్యా రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియలను ‘కన్యా సంక్రమణం’ అని అంటారు. దీన్నే ‘కన్యా సంక్రాంతి’ అని కూడా పిలుస్తారు. అది ఈరోజే. ఈమేరకు సాయంత్రం 5:01 గంటలకు సూర్యుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ పవిత్రమైన రోజున సూర్యుడిని పూజించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

News September 17, 2025

నేడు ఇలా స్నానం చేయడం చాలా పవిత్రం

image

కన్యా సంక్రమణం రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా శరీర శుద్ధి, మనఃశుద్ధి కలుగుతాయని, జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేయడం వీలుకాకపోతే.. చిన్న చెరువులో స్నానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇలా చేస్తే.. కీర్తి ప్రతిష్ఠలు పెరగడంతో పాటు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు.