News March 30, 2024

ఉల్లంఘనలపై ‘విజిల్’తో హెచ్చరిస్తున్నారు

image

సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్‌లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.

Similar News

News February 11, 2026

గోడ‌పై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

image

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.

News February 11, 2026

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ 34 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in

News February 11, 2026

అభిషేక్ రేపు ఆడతారా.. తిలక్ ఏమన్నారంటే?

image

T20WC: కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ రేపు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడతారా? లేదా? అన్న సందేహం నెలకొంది. దీనిపై తిలక్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. రేపు మ్యాచ్ టైమ్‌కు అతని ఫిట్‌నెస్‌‌ను బట్టి ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు అభిషేక్ గైర్హాజరైతే అతని స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.