News March 5, 2025

హింసాత్మక సినిమా.. టీవీ ప్రసారానికి సెన్సార్ నో

image

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన మార్కో మూవీకి షాక్ తగిలింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా శాటిలైట్ ప్రసారానికి మాత్రం బ్రేక్ పడింది. దాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేయొద్దని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో ఈ చిత్రానికి టీవీ ప్రీమియర్ ఇక అనుమానమే. హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన మార్కో, మలయాళ చిత్ర చరిత్రలోనే అత్యంత హింసాత్మక సన్నివేశాలు కలిగిన చిత్రంగా నిలిచింది.

Similar News

News February 14, 2026

తొందరపాటు నిర్ణయంతో 90% మంది ఫెయిల్: మంత్రి

image

AP: 2019-24 మధ్య సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలతో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘తొందరపాటు నిర్ణయంతో 1,000 స్కూళ్లను CBSE విధానానికి మార్చడం వల్ల 90% మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. టీచర్ల సన్నద్ధత లేకపోవడంతో “టోఫెల్” ఫెయిలైంది. పరిపాలనా వైఫల్యంతో “నాడు-నేడు”లో ₹7,875Cr మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలాయి’ అని వివరించారు.

News February 14, 2026

అమరావతిలో రూ.57,868 కోట్లతో పనులు: మంత్రి పయ్యావుల

image

AP: 2026 మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక పేద కుటుంబాలకు 25 లక్షల పట్టాలు/ఇళ్లను అందించి, సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని వివరించారు.

News February 14, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.