News January 25, 2025

తిరుమలలో ఫిబ్రవరి 4న VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. 9కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 57,655 మంది దర్శించుకోగా 20,051 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.73కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే 3-5 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపేశారు.

Similar News

News November 20, 2025

ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు: డీకే శివకుమార్

image

KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయిందని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News November 20, 2025

పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

image

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్‌లో 10 మంది మిస్సింగ్!

image

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్‌కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.