News January 25, 2025
తిరుమలలో ఫిబ్రవరి 4న VIP బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. 9కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 57,655 మంది దర్శించుకోగా 20,051 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.73కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే 3-5 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపేశారు.
Similar News
News February 9, 2025
UP వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ

WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజీ నియమించింది. గత సీజన్‌లో దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 27 ఏళ్ల దీప్తి భారత్ తరఫున 124 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. WPLలో 17 మ్యాచులు ఆడి 385 పరుగులు, 19 వికెట్లు సాధించారు.
News February 9, 2025
మరణాల్ని పుతిన్ ఆపాలనుకుంటున్నారు: ట్రంప్

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.
News February 9, 2025
మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. తన తల్లితో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్‌తో పూర్తిగా విభిన్నంగా ఉన్నారు. కాగా విజయ్ నటిస్తున్న వీడీ12’(వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి ఈ నెల 12న టైటిల్, టీజర్ విడుదల కానున్నాయి.