News March 14, 2025

VIRAL: కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ చూశారా?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరో 8 రోజుల్లో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, ఆయన నయా హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ షేర్ చేస్తూ ‘GOAT ఎనర్జీ’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 218 రన్స్ చేసిన కింగ్, ఈసారి తన బ్యాటింగ్‌తో ఆర్సీబీకి తొలి కప్ అందిస్తారేమో చూడాలి.

Similar News

News March 27, 2025

జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

image

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.

News March 27, 2025

అందరం అవయవదానం చేద్దాం.. సభలో కేటీఆర్ ప్రతిపాదన

image

TG: ఆర్గాన్ డొనేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. సభ్యులంతా అవయవదానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సభ నుంచే ప్రజలకు మంచి సందేశం పంపాలని ఆయన అన్నారు.

News March 27, 2025

అమిత్‌షాపై ప్రివిలేజ్ నోటీసు తిరస్కరించిన RS ఛైర్మన్

image

HM అమిత్ షా‌పై కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సోనియా గాంధీపై ఆయన విమర్శల్లో తప్పేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంటుగా సోనియా గాంధీ విపత్తు నిధి డబ్బులను వాడుకున్నారు. PMNRF కమిటీలో PM, కాంగ్రెస్ Prez ఉండేలా అప్పటి PM నెహ్రూ ప్రకటించారు’ అని 1948 నాటి ప్రెస్ రిలీజును షా కోట్ చేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించానని ధన్‌ఖడ్ తెలిపారు.

error: Content is protected !!