News November 18, 2024
VIRAL: ఆకాశంలో నగరముందా ఏంటి?

మలేషియాలో ఉన్న జెంటింగ్ హైలాండ్స్ అనే నగరం ఆకాశంలో ఉందా? అన్నట్లుగా పర్యాటకులను అబ్బురపరుస్తుంటుంది. ఈ ప్రాంతం ఏకంగా 1800 మీటర్ల ఎత్తులో, టిటివాంగ్సా పర్వతాలలో మౌంట్ ఉలు కాలీ శిఖరంపై ఉంది. ఈ హిల్ స్టేషన్‌ను 1965లో మలేషియా వ్యాపారవేత్త లిమ్ గో టోంగ్ స్థాపించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 °C (77 °F)కు మించవు. జెంటింగ్ హైలాండ్స్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 8.4 °C (47.1 °F).
Similar News
News March 7, 2026
రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
News March 7, 2026
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. మార్చి 9 నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెలక్షన్స్ ప్రారంభమవుతాయి. 9, 10 తేదీల్లో మహిళలకు, 12 నుంచి 16 వరకు పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్ లేదా డిప్లొమాలో 50% మార్కులు ఉండాలి.
News March 7, 2026
మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్‌కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


