News December 18, 2024
VIRAL: మద్యం ప్రియుల కొత్త డిమాండ్ అంటూ అధికారి పోస్ట్
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ ఓ IRAS అధికారి చేసిన ట్విటర్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నికలు తర్వాత మద్యం ప్రియుల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. దయచేసి ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. అందులో గోవాలో రూ.320లు ఉన్న వైన్ బాటిల్ కర్ణాటకలో రూ.920గా ఉంది. దీనిపై కూడా వన్ నేషన్- వన్ రేట్ అని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News January 21, 2025
కార్చిచ్చు రేగిన LAలో ట్రంప్ పర్యటన
అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్.. ప్రకృతి విధ్వంసం సృష్టించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు. కార్చిచ్చుతో భారీగా నష్టపోయిన కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెలిస్‌లో శుక్రవారం పర్యటించనున్నారు. అలాగే నార్త్ కరోలినాలో హరికేన్ ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ట్రంపునకు ఇదే తొలి అధికారిక పర్యటన.
News January 21, 2025
టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్: నారా లోకేశ్
AP: టెక్ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. AIలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌లో చెప్పారు. మరోవైపు ఇదే సదస్సులో CM చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మార్క్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు CM ట్వీట్ చేశారు. ఈ కంపెనీలన్నింటికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
News January 21, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’.. ALL TIME RECORD
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ.203 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రాంతీయ సినిమాల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొంది. కాగా వెంకటేశ్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ఇదే. జనవరి 14న రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.