News April 15, 2025
VIRAL: టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లెటర్

తాను పనిచేసే కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లేఖ రాశాడు. సింగపూర్‌కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్‌ను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఈ కంపెనీ నన్ను ఎలా ట్రీట్ చేసిందో తెలిపేందుకే ఇలాంటి పేపర్‌ను ఎంచుకున్నా’ అని అతడు అందులో రాసుకొచ్చాడు. ఉద్యోగులు బయటికి వెళ్లేటప్పుడు కృతజ్ఞతతో ఉండేలా చూడటం సంస్థ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని యో అన్నారు.
Similar News
News November 20, 2025
ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్‌పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్లు అందుకుంది.
News November 20, 2025
KTR ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. రేవంత్ ఏం చేస్తారో చూడాలి: సంజయ్

TG: రాష్ట్రంలో RK (రేవంత్, కేటీఆర్) పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంతకాలం కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఏం చేస్తారో, ఏం చెప్తారో చూడాలి. వాళ్లిద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుంది’ అని వ్యాఖ్యానించారు.
News November 20, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>


