News April 15, 2025

VIRAL: టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లెటర్

image

తాను పనిచేసే కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లేఖ రాశాడు. సింగపూర్‌కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్‌‌ను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఈ కంపెనీ నన్ను ఎలా ట్రీట్ చేసిందో తెలిపేందుకే ఇలాంటి పేపర్‌‌ను ఎంచుకున్నా’ అని అతడు అందులో రాసుకొచ్చాడు. ఉద్యోగులు బయటికి వెళ్లేటప్పుడు కృతజ్ఞతతో ఉండేలా చూడటం సంస్థ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని యో అన్నారు.

Similar News

News April 19, 2025

IPL చరిత్రలో అతిపిన్న వయస్కుడు అరంగేట్రం

image

RRతో మ్యాచులో LSG కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. RRకు శాంసన్ దూరం కాగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నారు. అతిపిన్న వయసులో IPL ఆడుతున్న ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టించారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, సమద్, ఆవేశ్, బిష్ణోయ్, దిగ్వేశ్, శార్దూల్, ప్రిన్స్
RR: జైస్వాల్, దూబే, రాణా, పరాగ్, జురెల్, హెట్మైర్, హసరంగా, ఆర్చర్, తీక్షణ, సందీప్, దేశ్‌పాండే

News April 19, 2025

మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

image

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.

News April 19, 2025

హెరాల్డ్ కేసులో మేం భయపడేది లేదు: ఖర్గే

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీం కోర్టు తమ పార్టీ లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని ఖర్గే పిలుపునిచ్చారు.

error: Content is protected !!