News January 23, 2025
VIRAL: సిగరెట్ మానేసేందుకు వింత నిర్ణయం

తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేసేందుకు వింత నిర్ణయం తీసుకున్నారు. తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించి, దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నారు. 2013 నుంచి ఆయన ఇలాగే హెల్మెట్తో దర్శనమిస్తున్నారు. గతంలో ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవారు. పిల్లల బర్త్డే రోజు మానేయడం, మళ్లీ తాగడం చేస్తుండేవారు. దీంతో ఈ హెల్మెట్ ఆలోచన చేశారు.
Similar News
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం