News March 30, 2024
రింకూ సింగ్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత KKR ప్లేయర్లను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిశారు. యువ బ్యాటర్లను అభినందిస్తూ వారికి పలు సూచనలు చేశారు. ఈక్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో దిగిన ఫొటోలను KKR ప్లేయర్ రింకూ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు పలు సూచనలు చేసి స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2026
నేను గంగూలీని కాదు.. కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

తాను బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై టెన్నిస్ దిగ్గజం, బీజేపీ నేత లియాండర్ పేస్ ఘాటుగా స్పందించారు. ‘నువ్వు బెంగాలీనేనా’ అని ఎవరైనా అడిగితే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పేరు గంగూలీ కాకపోవచ్చు. కానీ నేను బెంగాలీనే. మా నాన్నది పోర్చుగీస్ కావచ్చు. నేను ఈ దేశానికి చెందిన వాడినే. కోల్‌కతాలోనే పుట్టాను. సౌత్ క్లబ్లో నా టెన్నిస్ జర్నీ మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.
News April 4, 2026
15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.
News April 4, 2026
ప్రేమ విఫలమై పెళ్లి నిరాకరిస్తే నేరం కాదు: హైకోర్టు

తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ప్రేమించి ఆ పిదప పెళ్లికి నిరాకరించడం అన్ని సందర్భాల్లోనూ నేరం/మోసం కిందకు రాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమేనని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ ఓ యువతితో ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకోలేదనే కారణంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. దీనిపై సంతోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును కొట్టేసింది.


