News February 4, 2025

సచిన్ మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

image

సచిన్ రికార్డులను బద్దలుకొడుతున్న కోహ్లీ మరో ఘనతకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో 94 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 14K రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. సచిన్ 350వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నారు. కోహ్లీ ఇప్పటి వరకు 283 INGలు ఆడి, 13,906 పరుగులు చేశారు. విరాట్‌ ఇంకా 55 ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నా, 6న ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్‌లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News March 11, 2026

సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

image

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

News March 11, 2026

‘కరోనా’కు ఆరేళ్లు

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?