News March 29, 2024

రికార్డు సృష్టించిన విశాఖ పోర్టు

image

సరుకు రవాణాలో వైజాగ్ పోర్టు సరికొత్త రికార్డుని సృష్టించింది. ఒకేరోజులో 80మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. ఇది పోర్టు చరిత్రలోనే అత్యధికం. ఈ రికార్డుపై పోర్టు ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది రవాణాలో క్రూడాయిల్ 27శాతం, ఇనుము 12శాతం, ఎరువులు 6శాతం పెరిగినట్లు సమాచారం. పోర్టుకు వచ్చిన నౌకల సంఖ్యలోనూ 35శాతం పెరుగుదల ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News February 9, 2026

జగిత్యాల డాక్టర్ శంకర్‌కు డయాబెటిస్ ఫెలోషిప్ అవార్డు

image

జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ భీమనాతిని శంకర్ డయాబెటిస్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో డయాబెటిస్ ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13-15 వరకు జరిగే ‘ప్రపంచ మధుమేహ మహాసభ’లో గత 48 యేళ్ళుగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను గుర్తించి ‘డయాబెటిస్ ఫెలోషిప్’ అవార్డు ప్రదానం చేయనున్నారు. కళాశ్రీ అధినేత గుండేటి రాజు తదితరులు అభినందించారు.

News February 9, 2026

కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

image

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.

News February 9, 2026

రింకూ సింగ్ పెళ్లి మరోసారి వాయిదా

image

ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ MP ప్రియా సరోజ్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. T20 WC, IPL నేపథ్యంలో ముహూర్తం జూన్‌కు మార్చినట్లు రింకూ సోదరుడు సోనూ వెల్లడించారు. కాశీలో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్ 8న వీరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తొలుత పెళ్లికి నవంబర్‌లో డేట్ ఫిక్స్ చేశారు.