News August 4, 2024

విశాఖ రైల్వేజోన్‌కే మా తొలి ప్రాధాన్యత: కేంద్ర మంత్రి

image

AP: విశాఖ రైల్వేజోన్‌ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రం అడిగిన భూమిని సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. దీంతో ఈ అంశం అక్కడే నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

News November 27, 2025

బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.