News June 19, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంతో చర్చిస్తాం: శ్రీనివాసవర్మ

image

AP: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా స్టీల్‌ప్లాంట్‌పై ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ‘నాన్‌స్ట్రాటజిక్ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ తెరపైకొచ్చింది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడను. దీనిపై CBN, పవన్‌తో కలిసి PMతో చర్చిస్తాం’ అని తెలిపారు.

Similar News

News November 2, 2025

4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

image

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్‌లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.

News November 2, 2025

ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్

image

ఎన్నో రహస్యాలకు నెలవైన నింగికి చందమామే అందం. ఆ చంద్రుడు ఈ నెల 5న మరింత పెద్దగా, కాంతిమంతంగా కనివిందు చేయనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే బీవర్ సూపర్ మూన్‌గా నిలవనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ రోజున జాబిలి భూమికి 356,980KM దగ్గరకు వస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదంటున్నారు. కాగా డిసెంబర్‌లోనూ ఓ కోల్డ్ మూన్ అలరించనుంది.

News November 2, 2025

HYDకు మెస్సీ.. వారంలో బుకింగ్స్

image

ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. కేరళ ప్రోగ్రామ్ రద్దవడంతో HYDను చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి/రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదిక ఉంటుందని, వారంలో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. GOAT Cupలో భాగంగా డిసెంబర్ 12/13 తేదీల్లో మెస్సీ కోల్‌కతా చేరుకుంటారు. అదే రోజు HYD, 14న ముంబై, 15న ఢిల్లీలో సెలెబ్రిటీలతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతారు.