News September 29, 2024
విశాఖలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్

AP: సీఎం చంద్రబాబుతో నిన్నటి సమావేశం విజయవంతమైందని లులు ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ‘చంద్రబాబుతో నాకు 18 ఏళ్ల అనుబంధం ఉంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన షాపింగ్ మాల్తో పాటు 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లు నిర్మిస్తాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.
News November 27, 2025
BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.


