News September 29, 2024

విశాఖలో షాపింగ్‌ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్

image

AP: సీఎం చంద్రబాబుతో నిన్నటి సమావేశం విజయవంతమైందని లులు ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ‘చంద్రబాబుతో నాకు 18 ఏళ్ల అనుబంధం ఉంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన షాపింగ్ మాల్‌తో పాటు 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లు నిర్మిస్తాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News October 15, 2024

వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874: నాబార్డు

image

TG: రాష్ట్రంలో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు నాబార్డు తెలిపింది. మిగతా 45% శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి ఉందని తెలిపింది. వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 ఉండగా, నెలవారీ ఖర్చు రూ.13,093గా ఉంది. తగినంత ఆదాయం లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చి, ఉద్యోగాలు చేసుకుంటున్నాయని వెల్లడించింది.

News October 15, 2024

అకౌంట్‌లోకి రూ.16 లక్షలు.. తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష

image

భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్‌కు సింగపూర్‌లో 9 వారాల జైలు శిక్ష పడింది. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన డబ్బులు తిరిగివ్వనందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఓ మహిళ తాను పనిచేసే సంస్థలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించే క్రమంలో అతని అకౌంట్‌కు పంపింది. ఆ డబ్బు తనది కాదని తెలిసినా అతను తన అప్పులు తీర్చి, కుటుంబానికీ కొంత పంపాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు.

News October 15, 2024

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

image

TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.