News March 29, 2025
ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 1, 2025
ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
News November 1, 2025
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్కు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News November 1, 2025
కార్తీక వ్రతం మహిమిదే..

కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగుల వలె భయంతో పారిపోతారు. వందల కొద్దీ యాగాలు చేసిన వారికి స్వర్గ లోకం మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ములు నేరుగా వైకుంఠ ధామాన్ని చేరుకుంటారు. కాబట్టి ఇతర యాగాదుల కన్నా పవిత్రమైన, ఉత్తమమైన మోక్ష మార్గం ఈ కార్తీక మాస వ్రతమే అని తెలుసుకొని, ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. <<-se>>#Karthikam<<>>


