News May 21, 2024

ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశాల్ ‘రత్నం’

image

హీరో విశాల్, ‘సింగం’ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’. గత నెల 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు.

Similar News

News January 9, 2025

ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

image

AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.

News January 9, 2025

రేపటి నుంచి సెలవులు

image

APలోని స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరకు సెలవులు ఉంటాయి. 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. కాలేజీలకు సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? కామెంట్ చేయండి.

News January 9, 2025

కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న BRS నేతలు

image

TG: ACB విచారణ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్ సోదరి, MLC కవిత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆమెతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.