News May 23, 2024
OTTలోకి వచ్చేసిన విశాల్ ‘రత్నం’

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మూవీ ‘రత్నం’ ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ హరి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యోగిబాబు, గౌతమ్ మేనన్, మురళీ శర్మ, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.
Similar News
News April 19, 2026
రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
News April 19, 2026
సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.
News April 19, 2026
రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.


