News February 15, 2025
‘స్పిరిట్ సినిమాలో నటించేందుకు విష్ణు, బ్రహ్మాజీ ఆసక్తి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో నటించేందుకు తాను అప్లై చేసుకున్నానంటూ హీరో మంచు విష్ణు తెలిపారు. ‘స్పిరిట్’ టీమ్ చేసిన ట్వీట్కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి నటుడు బ్రహ్మాజీ సైతం అప్లై చేసినట్లు రిప్లై ఇవ్వడంతో ఈ చిత్రం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. కాగా విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే
Similar News
News November 24, 2025
ముగిసిన జీ20 సమ్మిట్.. తిరుగు పయనమైన మోదీ

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
News November 24, 2025
విభూది ఎందుకు ధరించాలి?

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News November 24, 2025
నేటి నుంచి రాష్ట్రంలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం

AP: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి అమలుతో సాగులో కలిగే మేలుపై రైతుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన అధికారులు వివరించనున్నారు.


