News February 15, 2025

‘స్పిరిట్ సినిమాలో నటించేందుకు విష్ణు, బ్రహ్మాజీ ఆసక్తి!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో నటించేందుకు తాను అప్లై చేసుకున్నానంటూ హీరో మంచు విష్ణు తెలిపారు. ‘స్పిరిట్’ టీమ్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి నటుడు బ్రహ్మాజీ సైతం అప్లై చేసినట్లు రిప్లై ఇవ్వడంతో ఈ చిత్రం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. కాగా విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే

Similar News

News March 27, 2025

కొడాలి నానికి ఆపరేషన్

image

AP: YCP నేత కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు HYDలోని AIG డాక్టర్లు నిర్ధారించారు. ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. మరికొన్ని వైద్య పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి ఆరోగ్యంపై మాజీ CM జగన్ డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు నాని అనారోగ్యం విషయం తెలిసి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 27, 2025

DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

image

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.

News March 27, 2025

ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

image

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

error: Content is protected !!